ధ్వంసకాండ

Posted by నవజీవన్

ధ్వంసకాండ (కవిత)


విధ్వంస  చర్యలకు నేను నిలువెత్తు నిదర్శనం
రాజకీయ అలజడులకు నేను ఒక టార్గెట్
నువ్వు ప్రజల ఆస్తి వని అంటుంది ప్రభుత్వం
ప్రభుత్వమంటే ప్రజలే కదా అంటుంది రాజ్యాంగం
ప్రజల సొమ్ము తో నేను కాళ్ళకు చక్రాలు కడతాను
కాని విధ్వంస కారులు నా మానాన్ని పణంగా పెడతారు
నన్నుహింసిస్తారు
అగ్ని కీలలకు ఆహుతి చేస్తారు
నేను జనుల సేవ చేస్తున్నా నేనంటే కొందరికి చిన్న చూపు ఎందుకో
నన్ను నాశనం చేసి ప్రభుత్వానికి నష్టమంటారు
ఇక్కడ ప్రభుత్వమంటే ప్రజలే అన్న సంగతి ని మర్చిపోతారు
బడా మేధావులు ఈ చర్య ను కూడా ప్రజాస్వామ్యమనే అంటారు
నడిరోడ్డు పై మార్పు కొరకే ఇదంతా చేస్తున్నామంటారు
హింసా మార్గాలను రెచ్చగొట్టి నన్ను ఓ పావురాయి గా చేస్తుంటారు
అహింస కు కాలం చెల్లిందని చెప్పకనే చెపుతారు
యువత ను ఎటూ తెల్చుకోనీయకుండా అయోమయానికి గురి చేస్తారు
నేను కొందరి చేతిలో కీలుబోమ్మని
ధ్వంస కాండలకు ప్రత్యక్ష సాక్షిని
"ఆర్.టి.సి.బస్సుని"



0 comments:

Post a Comment