బ్లాగు ప్రయాణం

Posted by నవజీవన్

కొత్త సంవత్సరం లో సరి కొత్త బ్లాగు ప్రయాణం 

విచిత్రమేమిటంటే చాలా రోజుల నుండి ఒక మంచి బ్లాగు ప్రారంభించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చేసి కొన్నాళ్ళు వేచి యుండి మరీ ప్రారంభించిన బ్లాగండీ ఈ "చైతన్య దీపిక"
ఈ బ్లాగు ని క్రితం సంవత్సరం మొదలు పెట్టినా కూడా చాలా రోజులు ఏమి రాయాలో అర్ధం అయ్యింది కాదు.
కవితలు రాయాలా, వ్యాసాలు రాయాలా, సమీక్షలు రాయాలా, లేక మ్యూజింగ్స్ అని పేరు పెట్టి సొంత భావాలతో నా గురించి రాయాలా అని అలోచించి ఆలోచించి చాలా రోజులు రాయడమే మానేసాను.
అయినప్పటికీ నాకు ఈ బ్లాగు లోకం లోకి అడుగుపెట్టిన తరువాత చాలా మంది మంచి మిత్రులే దొరికారు.
వారి ప్రోత్సాహం తో  ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నా బ్లాగు ని మరింత రమణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాను. 
నాకు తోచిన విధంగా ఎడా పెడా రాసేసి ఈ బ్లాగు ని బ్లాగు లోకం లో ఓ ధ్రువతార గా మార్చాలని ప్రయత్నిస్తూ 
ఇప్పటి కి సెలవు తీసుకుంటున్నాను.
-బాబు 

0 comments:

Post a Comment