మట్టి ప్రమిద

Posted by నవజీవన్

మట్టి ప్రమిదను నేను 
మట్టి ప్రమిదను నేను 
మట్టి లోనే పుట్టాను
మట్టి లోనే పెరిగాను
మట్టి తోనే తయారయ్యాను
మట్టి లోనే కలిసిపోతాను
పుట్టగానే శ్రామికుల కష్టాలను 
ఈ కంటి తో పరికించి చూసాను
శ్రామికుల శక్తి కి దర్పణం నేను 
ఎన్నెనో ఆలోచనలతో, ఆశయాలతో నిండిన
ఈ జగత్తు లో నేను సైతం ఒక చిరు చిహ్నంగా మారాను 
మట్టి ప్రమిదను నేను 
మట్టి లోనే పుట్టిన మనిషి మట్టి గా మారి 
మట్టి లో కలిసి నప్పుడు
నేను ఆ మనిషి ఇంటి గడప దగ్గర 
దీపంగా మారాను
మట్టి ప్రమిదను నేను 
మట్టి లోనే పుట్టాను
మట్టి లోనే పెరిగాను
మట్టి తోనే తయారయ్యాను
మట్టి లోనే కలిసిపోతాను
ఒక ఇల్లాలు భక్తి తో  దేవుణ్ణి కొలిచినప్పుడు
ఆ దేవుని పాదాల దగ్గర జ్యోతి గా మారాను
మట్టి ప్రమిదను నేను 
నేను మట్టి లోనే పుట్టాను
సహనశీలి ని నేను
నా భుజాన అగ్ని ఛాయలు ప్రసరిస్తున్నా 
ఓర్పుతో బాధ ను అదిమిపట్టి లోకానికి వెలుగు ను
అందించే నిగర్విని నేను 
"తమసోమ జ్యోతిర్గ మయ" అన్న సూక్తి కి వినూత్న భావాన్ని నేను
నిరంకుశత్వం తో నీతి నియమాలను సైతం  లెక్క చేయక 
విజయగర్వం తో విర్రవీగే కొన్ని వర్గాలకు అతీతం నేను
నిర్మలత్వం తో , నిర్భీతి తో నిగూఢ సత్యాలను లోకానికి అందించే
మరో సత్యాన్ని నేను 
మట్టి ప్రమిదను నేను 
వెలుగు దీపిక ను నేను
మనో గీతిక ను నేను
జ్ఞాన ప్రతీకను నేను 
మహనీయుల మంచి తనానికి మరో సంకేతాన్ని  నేను
మానవుల మనుగడ కు ముప్పు వాటిల్లుతున్న ఈ ప్రపంచం లో
మరో మార్పు కోసం కృషి చేస్తున్న ఎందఱో చైతన్య శీలురకు
బాసటగా నిలిచే ప్రగతి స్వప్నాన్ని నేను
మట్టి ప్రమిదను నేను 

1 comments:

  1. కెక్యూబ్ వర్మ said...

    సహనశీలి ని నేను
    నా భుజాన అగ్ని ఛాయలు ప్రసరిస్తున్నా
    ఓర్పుతో బాధ ను అదిమిపట్టి లోకానికి వెలుగు ను
    అందించే నిగర్విని నేను
    బాగుంది నవజీవన్ గారు.

Post a Comment