హోమర్

Posted by నవజీవన్


హోమర్ ఎంత గొప్పవాడు?
గ్రీకు సాహిత్యం లో తనకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించుకున్న వాడు హోమర్. ఇలియడ్ వంటి గొప్ప గ్రీకు కావ్యాన్ని రచించి చరిత్రలో తనకు అంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకున్న వ్యక్తి  హోమర్. అంటే మనకు వాల్మీకి లా అన్న మాట. ఇంతటి గొప్ప సాహిత్యవేత్త జీవతం గురించి ఎన్నో చిత్రమైన కథలు ఉన్నాయి. హోమర్ గ్రుడ్డివాడని కొందరు ఇప్పటికి భావిస్తారు. హోమర్ రాత్రి పూట ఏవో కథలు పద్యాల రూపం లో గానం చేస్తూ నగర వీధుల్లో సంచరించే వాడని గ్రీకులు నమ్ముతారు.అలా పద్యాల రూపం లో చెప్పిన కథలే తరువాత ఇలియడ్ కావ్యంగా మలచబడ్డాయని ప్రతీతి. ఇలియడ్ లో హోమర్ ట్రోజన్ యుద్ధం గురించి వర్ణించిన తీరు అద్బుతం. ట్రోజన్లకు , గ్రీకులకు మధ్య జరిగిన యుద్దాన్ని కంటికి కట్టినట్లు వర్ణించి రాసిన అద్భుత కావ్యం "ఇలియడ్".ఇలియడ్ కావ్యం మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఈ కథ చరిత్రను వక్రీకరిస్తుంది అని కొందరి అభిప్రాయం. పైగా హోమర్ జీవించిన కాలం  గురించి కూడా సాహితీ పరిశోధకులు మరియు చరిత్ర కారులు ఒక అంచనానికి   రాలేకపోతున్నారు.ట్రోజన్ యువరాజు పారిస్ గ్రీకు సుందరి హెలెన్ ను లేవదీసుకు పోవడం ఇలియడ్ లో ముఖ్య ఘట్టం అయితే అందుకు దైవ బలం సహకరించడం, అనేక గ్రీకు దేవతలు వారి వారి భక్తుల కోరికల మేరకు యుద్ద వాతావరణం లో యుద్ద వీరులకు సహాయపడటం ఈ కావ్యం లో విచిత్రం. అలా అనేక విచిత్రాలతో నడిచే ఈ కావ్యం ట్రోజన్ల పరాజయం తో ముగుస్తుంది. తప్పక అధ్యయనం చేయవలసిన గొప్ప గాధ "ఇలియడ్". ఈ కావ్యం హోమర్ గొప్పతనాన్ని ప్రస్ఫుటితంగా చెపుతుంది. కల్పితమో, నిజమో తెలియదు గాని ఈ కథ అరేబియన్ నైట్స్ ను మించి అనురక్తిని, ఆసక్తి ని కలిగిస్తుంది.

0 comments:

Post a Comment