సారుస్

Posted by నవజీవన్

సారుస్ 
సారుస్ ఒక కొంగ పేరు. 
ఇది భారతీయ పక్షులలో కెల్లా అతి పెద్దదయినది.
పంట ప్రదేశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దీనిని చూడవచ్చు.
దీనికి దైర్యము, దృడ సంకల్పము ఎక్కువ అని మంచి పేరుంది.
సారుస్ పక్షులు ఆహారాన్ని పగటి పూటే వెతుక్కుంటాయి. 
ఇవి తరచు జంటలు గానే కనిపిస్తుంటాయి. 
సారుస్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి మనుష్యులకు భయపడవు . 
ఒక రక్షణ శ్రేణి ని తమ చుట్టూ ప్రక్కల ఏర్పరచుకుంటూ ఇవి కలహ శీల గుణమును ప్రదర్శిస్తాయి.
వీటి ఆహరం గడ్డలు, వేర్లు, దుంపలు, పురుగులు, నత్తలు, కప్పలు మరియు పండిన గింజలు. 
సారుస్ కొంగలు గుడ్లను కలిసే పొదుగుతాయి.
ప్రస్తుతం అంతరించిపోతున్న  పక్షి జాతుల్లో "సారుస్" కూడా ఒకటి.

0 comments:

Post a Comment