స్నేహం

Posted by నవజీవన్

స్నేహం అనేది ప్రతి మనిషి జీవితం లో ఎంతో విలువైనది. స్నేహితుల తో మనం గడిపే మధురమైన క్షణాలు అపురూపమైనవి. ఒక మంచి స్నేహితున్ని సంపాదించుకుంటే చాలు జీవితం లో ఏ వెలితీ ఉండదు. కోటి ఆశలను  
చిగురింప జేసే విలువైన బంధం స్నేహం. కానీ కొన్ని అక్కరకు రాని స్నేహాలు అప్పుడప్పుడు స్నేహంలో లోటుపాట్లను కూడా ఎత్తిచూపించడం విషాదకరం. అటువంటి స్నేహలలో కొన్ని 
1. ఒక స్నేహితుడు డిగ్రీ చదువుతున్న రోజుల్లో చాలా  దగ్గరయ్యాడు. అభిప్రాయ భేదాలు రావడం వలన తొందరగానే విడిపోయాము జరిగింది. కానీ క్లాస్ మేట్ కాబట్టి  ఒక సగటు స్నేహితునిగా చూడటం తప్పు లేదు. కానీ నేను విడిపోదామనుకున్నా  అతను నన్ను విడిచిపెట్టలేదన్న సంగతి తర్వాత అర్ధం అయ్యింది. కేవలం అభిప్రాయలు కలవలేదన్న  కారణం తోనే నన్ను అందరిలో తక్కువ చేసి మాట్లాడటం, తన ఇతర స్నేహితుల వద్ద నన్ను కించపరిచేలా వ్యవహరించడం చేస్తుండేవాడు. ఇదే విషయాన్ని  అడిగితే స్నేహం లో ఇవి అన్నీ  మామూలే అనేవాడు. నేను వద్దనుకున్న స్నేహాన్ని కూడా తానే కావాలనుకుని నన్ను ఓ పావుగా స్నేహం పేరుతో వాడుకోవడం ఆశ్చర్యం తో పాటు ఆందోళనను కూడా కలుగజేసింది.
2. ఒక స్నేహితుడు నేను బాగా కష్టకాలం లో ఉన్నప్పుడు తాను  మధ్యవర్తి గా ఉండి  ఒక ఉద్యోగానికి  దరఖాస్తు  పెట్టించడం జరిగింది. ఆ సంస్థ వారు నా స్నేహితుని స్నేహితునికి బాగా దగ్గర కావడం వలన ఒక మాటతోనే అనుకున్న పని అయ్యింది. కాని   సంస్థ పద్దతులు నా అభిప్రాయాలకు అనైతికం అనిపించడం వలన స్వచ్చందంగా రాజీనామా చేశాను. దాన్ని నా స్నేహితుడు మోసంగా  పరిగణించాడు. జీవితం లో తీసుకొనే ముఖ్యమైన నిర్ణయాలు ఒకరికి చెప్పి చేసి, అస్తిత్వాన్ని పోగొట్టుకొనే విధంగా వ్యవహరించడమా , లేక స్నేహమనే విషయం తో రాజీ పడాలా  అన్న విషయం నాకు అర్ధం కాలేదు.
కొన్ని విషయాలలో స్నేహం వలన ప్రతిబంధకాలు ఎదురైనా, ఎల్లప్పుడూ అవి ప్రతిబంధకాలు గానే ఉండిపోతాయన్న విషయం లో వాస్తవం లేదు అనిపిస్తుంది . స్నేహం ఎడారి లో ఒయాసిస్సు లాంటిది. కష్టకాలం లో ఒక ఆశాజ్యోతి లా మనకు సహాయం అందించడానికి, ఒక మార్గాన్ని చూపించడానికి తయారవుతుంది. అయితే మార్గం చూపించింది కదా అని కడ వరకు మార్గదర్శి లా వెన్నంటే ఉండి సేద తీర్చమని దాన్ని అడగాలనుకోవడం అవివేకం. మనిషి జీవితం లో స్నేహం ఒక మహత్తరమైన ఘట్టం మాత్రమే. మన కష్టాలు, నష్టాలూ, భావాలూ, బాధలు, ఆలోచనలు , లక్ష్యాలు పాలు  పంచుకోవడానికి కొందరు స్నేహితులు ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఆ స్నేహం  ఒక పుస్తకం రూపం లో కావచ్చు లేదా ఒక మంచి మనిషి రూపం లో కావచ్చు 
-నవజీవన్ 

0 comments:

Post a Comment