పిచ్చుక ..

Posted by నవజీవన్ఎక్కడికి వెళ్లావు?
ఏమిటి  ఈ మధ్యన అస్సలు కనిపించడం లేదు 
నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు  చూసాను 
నువ్వంటే నాకు ఎంతో ఇష్టం 
ఒక్క సారి వచ్చి కనిపించి వెల్లవూ 
నువ్వు అంతరించి పోయావని కొందరు అన్నారు 
నేను నమ్మలేదు 
చిన్నప్పటి రోజులు ఇప్పటికి నాకు గుర్తున్నాయి 
మా స్కూలు క్లాస్ రూం లో నీ గూటి ని 
మేము ఎంత జాగ్రత్త గా కాపాడేమో  తెలుసా 
నీ కిచ కిచ నవ్వులు మా హృదయాలను 
ఎన్ని సార్లు తట్టి లేపలేదు 
నీ కోసమే ఎన్ని సార్లు సాయం సంధ్య లో 
నేను వేచి చూడలేదు 
నువ్వు నా ప్రియమైన నేస్తానివి 
నీవు స్నేహ శీల తత్వాన్ని పుట్టుకతోనే 
అందిపుచ్చుకున్న చిరు ప్రాణివి 
నిన్ను చూడాలని ఉంది 
ఒక్క సారి ..
ఒకే ఒక్క సారి ..
నా ప్రియ నేస్తమా 
నా చిరు స్నేహమా ..

1 comments:

  1. Priya said...

    బాగుందండీ :)

Post a Comment