ప్రార్థన

Posted by నవజీవన్

ప్రార్థన 

రవీంద్రనాథ్ టాగోర్ కలం నుంచి జాలువారిన "ప్రార్థన "

(స్వార్థ చింతన తో మనిషి ప్రార్థన చేయరాదు, మనోధైర్యాన్ని పెంచే ప్రార్థనే నిజమైనది )

భగవంతుడా! అపాయాల నుండి రక్షణ కల్పించడానికి నేను నిన్ను వేడుకొను. కానీ వాటి నుండి నిర్భయంగా ఎదుర్కొనే  శక్తి ని ఇవ్వమని కోరుతాను.

భగవంతుడా! నా బాధల  నుండి విముక్తిని ప్రసాదించమని నిన్ను నేను అర్ధించను . కానీ ఆ బాధలను జయించే హృదయాన్ని  ఇవ్వమని కోరుకుంటాను.

భగవంతుడా! జీవితపు సమర  భూమి లో స్నేహితుల కోసం ఎదురు చూడనివ్వకు. నా బలం పైనే నన్ను ఆధారపడేలా చేయి. 

భగవంతుడా! క్రుంగ దీసే చింతల భయం నుండి కాపాడమని నేను నిన్ను యచించను . కానీ నా స్వాతంత్ర్యాన్ని పొందడానికి కావలసిన ఓపికను ప్రసాదించి నన్ను గెలిచేలా చేయమంటాను.

భగవంతుడా! పిరికిపంద గా కాకుండా ఉండడానికి వరాన్ని ఇవ్వు. నా విజయపు ఘడియల్లో మాత్రమే నీ దయను పొందేలా చేయకు, నా పరాజయం లో కూడా చేయూతను అందించేలా చేయి. 

0 comments:

Post a Comment