కవితాన్వేషణ

Posted by నవజీవన్

కవితాన్వేషణ  (కవిత)

ఏ చోట నీవున్నా
నీకై పరితపించెనులే నా హృది
నీకై అన్వేషణ సాగించెనులే
నా పదాల సవ్వడి

ఏ తీరాన ఉన్నావో
ఏ మజిలీలో భాగస్వామివైనావో
ఏ ఆనంద హేల లో
ప్రేమలీల వైనావో

ఏ నీరాజనం లో
వేదగాన మైనావో
ఏ స్వరజగత్తు లో
దివ్యస్వప్నమైనవో

ఏ మానవేతిహాసం లో
మనోహర దృశ్య మైనావో
ఏ యువతరంగాన
ధ్రువ నక్షత్రమైనవో

ఎచట ఉన్నావో..నువ్వు ఎచట ఉన్నావో..

ఎడతగని అలలో ఉన్నావా
ఎల్లలు లేని ఎడారి లో ఏకాకి వై సంచరిస్తున్నావా
తడారిపోయిన సైకత తరంగాలలో
క్రీనీడవై గోచరిస్తున్నావా
వంగిన ఆకాశం లో వయ్యారి భామవై నాట్యమాడుతున్నావా

వెలుగు ముద్దవై
అపరిచిత గణాలతో సయ్యాటలాడుతున్నావా
వెండి మబ్బులతో
దర్జాగా దోబూచులాడుతున్నావా

అగమ్య సంచారివైనావా
విశ్వపు పరిణామం లో చిన్ని అణువుగా మారావా
నిగూఢ సత్యాన్నివైనావా
బ్రతుకు రహస్యాలలో
బందీవైనావా

ప్రకృతి సత్యాన్ని
పదుగురికి చెబుతున్నావా
నిరంతర అన్వేషివై
విసిగి వేసారిపోయావా

నీవెచట ఉన్నా
నీకై ఆగదు నా ఈ అన్వేషణ
నా  "కవితాన్వేషణ"1 comments:

  1. జాన్‌హైడ్ కనుమూరి said...

    బాగుంది
    అభినందనలు

    రాస్తూ వుండండి

Post a Comment